లేటెస్ట్ : ‘సీతారామం’ ఐదు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంతంటే … ?

Published on Aug 11, 2022 1:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి అనే చెప్పాలి. వాస్తవానికి ఇటీవల విడుదలైన అనేక సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు తాజాగా అందరిలో మంచి హైప్ తో ఒకేరోజున రిలీజ్ అయిన బింబిసార, సీతారామం రెండు మూవీస్ కూడా ఆడియన్స్ ఆదరణ అందుకుని ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి. కాగా వీటిలో లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సీతారామం మూవీ అయితే మెల్లగా తన జోరుని కొనసాగీస్తూ అన్ని ఏరియాల్లో కూడా భారీ స్థాయిలో దూసుకెళ్తోంది.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో గ్రాండ్ గా దీనిని నిర్మించారు. అయితే విషయం ఏమిటంటే గడచిన ఐదు రోజుల్లో తమ మూవీ మొత్తంగా రూ. 33 కోట్ల రూపాయల కలెక్షన్ అందుకుందని యూనిట్ ప్రకటించింది. ఇంతటి గొప్ప ఆదరణను తమ మూవీకి అందిస్తున్న ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేసింది యూనిట్.

సంబంధిత సమాచారం :