డిజిటల్ పార్ట్నర్ ను ఫిక్స్ చేసిన “సెహరి”

Published on Feb 13, 2022 1:40 pm IST


హర్ష్ కనుమిల్లి మరియు సిమ్రాన్ చౌదరి నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సెహరి. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాని OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసింది.

ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్, ఆహా వీడియో డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. మరో 3 నుండి 4 వారాల్లో ఈ సినిమా ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్‌కి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. విర్గో పిక్చర్స్ బ్యానర్‌ పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోటి, అభినవ్ గోమతం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :