శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న అగ్ర‌గామి సంస్థ‌ !

శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న అగ్ర‌గామి సంస్థ‌ !

Published on Sep 17, 2018 5:31 PM IST

Asian Cinemas
యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియ‌స్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోరూపొందే ఈ ల‌వ్ స్టోరికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి.

కాగా మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఒక రివ‌ల్యూష‌న్‌ సృష్టించిన ఏషియ‌న్ గ్రూప్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ‌చేసే డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామిగా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా ఒక సుధీర్గ ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టింది. ఆ ప్ర‌యాణంలో తొలి అడుగు శేఖ‌ర్ కమ్ముల‌తో క‌ల‌సి వేస్తుంది. నిర్మాతలు గా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు వ్యవహారించనున్నారు.

కంటెంట్ ని త‌ప్ప, క్రేజ్ ని న‌మ్ముకొని శేఖ‌ర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ ల‌వ్ స్టోరీ కి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది నిర్మాణ సంస్థ‌. అయితే బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫిదా త‌ర్వాత శేఖర్ క‌మ్మ‌ల చేయ‌బోయే ప్రాజెక్ట్ కావడంతో.. ఇప్పుడు ఇండ్ర‌స్టీలోనూ, ప్రేక్ష‌కులోనూ ఈ ప్రాజెక్ట్ మీదే ఆస‌క్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు