‘7/జి బృందావన్ కాలనీ, పుదుపెట్టై, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సెల్వ రాఘవన్ తన ‘ఆయిరాతిల్ ఒరువన్’ సినిమాను రీరిలీజ్ చేశారు. తమిళనాడులో థియేటర్లు రీఓపెన్ అయిన సందర్భంగా ఈ రీరిలీజ్ ప్లాన్ చేశారు. 2010లో వచ్చిన ఈ సినిమాలో కార్తీ, ఆండ్రియా, రీమాసేన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పట్లో ఎలాగైతే సినిమాకు మంచి ప్రశంసలు అందాయో రీరిలీజ్ అప్పుడు కూడ అలాంటి ప్రశంసలే వస్తున్నాయి. మళ్లీ సినిమా చూసినవారు, ఇప్పుడు కొత్తగా చూస్తున్నవారు సెల్వ రాఘవన్ దర్శకత్వ ప్రతిభను పొగుడుతున్నారు.
సోషల్ మీడియాలో సెల్వ రాఘవన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు సినిమాను చాలా అడ్వాన్స్ గా ఆలోచించి తీశారని అంటూ దయచేసి సీక్వెల్ తీయమని రిక్వెస్ట్ చేయగా సెల్వ రాఘవన్ సైతం తీస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈయన ధనుష్ హీరోగా కొత్త చిత్రానికి సిద్దమవుతున్నారు. ఇది పూర్తవగానే ‘ఆయిరాతిల్ ఒరువన్ 2’ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు నెటిజన్లు సీక్వెల్ లో కూడ కార్తీనే హీరోగా తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సెల్వ రాఘవన్ ఫైనల్ డేసీషన్ ఎలా ఉంటుందో చూడాలి.


