“యుగానికి ఒక్కడు” అసలు బడ్జెట్ రివీల్ చేసిన డైరెక్టర్!

Published on Aug 19, 2021 12:25 pm IST

కొన్ని సినిమాలు ఎన్నాళ్లయినా కూడా సినీ ప్రేమికులలో అవి అప్పుడు రిలీజ్ అయ్యిన నాటికి ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయి అన్న దానితో సంబంధం లేకుండా చెరగని ముద్రను వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటే “యుగానికి ఒక్కడు”. కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ వండర్ ఎప్పటికీ కూడా ఒక మాస్టర్ పీస్ లాంటిది. అందుకే ఈ చిత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా దానికి సీక్వెల్ ప్రకటించగానే భారీ హైప్ ఒక్కసారిగా నెలకొంది.

తమిళ్ లో “ఆయిరతిల్ ఒరువన్” గా తెరకెక్కించిన తెలుగులో “యుగానికి ఒక్కడు” గా విడుదల చేశారు. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్ తో అంతకు మించి బ్రిలియెన్స్ తో సెల్వ రాఘవన్ తెరకెక్కించడంతో ఇప్పటికీ కూడా దీనిని ఛానెల్ మార్చకుండా చూస్తారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు సెల్వ రాఘవన్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రాన్ని తాను కేవలం 18 కోట్ల బడ్జెట్ తోనే పూర్తి చేసానని కానీ హైప్ కోసం 32 కోట్లు పెట్టామని చెప్పుకొచ్చామని అసలు విషయం చెప్పారు. అలాగే దీనిపై మరింత వివరణ కూడా ఇచ్చారు. ఇది మూర్ఖపు చర్యే అని అయితే ఈ సినిమా అసలు బడ్జెట్ ని రాబట్టినప్పటికీ దీనిని యావరేజ్ గానే లెక్కలోకి తీసుకున్నారు. కానీ తాను మాత్రం దాని తర్వాత ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా అబద్దాలు చెప్పకూడదు అనేది మాత్రం నేర్చుకున్నానని సెల్వ రాఘవన్ తెలిపారు. దీనితో ఈ సినిమా అసలు బడ్జెట్ తెలుసుకున్న వారు అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

సంబంధిత సమాచారం :