‘అరవింద సమేత’ షూటింగ్లో పాల్గొంటున్న సీనియర్ నటుడు !
Published on Jun 27, 2018 3:29 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో జగపతిబాబు, నాగబాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరితో పాటుగా తాజాగా మరొక ప్రముఖ నటుడు శుభలేక సుధాకర్ కుడ ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో చాలా తక్కువ సీనిమాల్లో కనిపించిన ఆయన ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook