నరేష్ కి అంతకు మించిన రెమ్యునరేషన్ ఇదేనట.!

Published on Jun 23, 2021 11:00 am IST

ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే ఇప్పుడు కూడా మరిన్ని మంచి పాత్రలు చేస్తూ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాను ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసి రెమ్యునరేషన్ తీసుకున్నా అంతకు మించిన రెమ్యునరేషన్ ఇదే అంటూ తాను తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

నటుడిగా ఉన్న నరేష్ రైతుగా మారి తాను వ్యవసాయం చేసి స్వయంగా పండించిన మామిడి పళ్ళు, రేగు పండ్లు అమ్మి డబ్బులు సంపాదించుకున్నారట. ఆ ఫోటోలను కూడా షేర్ చేసి ఒక్కో కేజీ 50 రూపాయల చొప్పున విక్రయించి మొత్తం 3 వేల 600 సంపాదించానని గర్వంగా చెప్పుకున్నారు. ఈ మొత్తమే తాను ఇప్పటి వరకు అందుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కన్నా గొప్పది అని ఆనందం వ్యక్తం చేసి వ్యవసాయం ప్రయత్నించి అందులోని ఆనందం ఆస్వాదించాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం :