ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న సీనియర్ విలన్

Published on Jan 31, 2020 9:00 am IST

నటుడు చలపతి రావు ఎన్టీఆర్ అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అలాంటి ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉంటారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుత్తున్నారు. విషయంలోకి వెళితే ఎన్టీఆర్ అభిమానులు కొన్ని నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ సామజిక సేవా ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ పేరున నిధులు సేకరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ అభిమాన హీరో పేరిట అభిమానులు చేపడుతున్న ఈ మంచి కార్యమాలను కొనియాడుతూ చలపతి రావు వారిని అభినందించారు.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని అడవులలో ఈ తాజా షెడ్యూల్ నడుస్తుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :