షాకింగ్ : అనారోగ్య కారణంగా మరణించిన సీనియర్ నటుడు రాళ్ళపల్లి

Published on May 17, 2019 8:30 pm IST

గతకొంత కాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్నటువంటి సీనియర్ నటుడు రాళ్ళపల్లి గారు నేడు సాయంత్రం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తీ పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. ఎన్నో ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులని అలరించినటువంటి, ప్రముఖ నటుడు మరియు నృత్య దర్శకుడు రాళ్ళపల్లి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

దాదాపుగా 850 చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి హైదరాబాద్ లోని మాక్స్ చురె ఆసుపత్రిలో మరణించారు. కాగా ఆయన భౌతిక ఖాయాన్ని వారి నివాస ప్రాంతానికి తరలిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సినీ పరిశ్రమకి వచ్చినప్పటినుండి ఆయన ఎన్నో అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా మూడు సార్లు నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే చిత్రం ద్వారా రాళ్ళపల్లి సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టాడు.

సంబంధిత సమాచారం :

More