కేసీఆర్ పాత్రను పోషించే నటుడు దొరికాడు !

కేసీఆర్ పాత్రను పోషించే నటుడు దొరికాడు !

Published on Jun 28, 2018 10:51 AM IST

తెలుగునాట బయోపిక్స్ కు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. దర్శకులు, నిర్మాతలు ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్స్ రూపంలో తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘ఎన్టీఆర్’ పేరుతో, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను మహి వి రాఘవ్, మమ్ముట్టిలు ‘యాత్ర’ పేరుతో రూపొందిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ కు కూడ రంగం సిద్ధమైంది.

ముందుగా కేసీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తారని వార్తలురాగా చివరికి సీనియర్ నటుడు నాజర్ ను ఈ పాత్రకు ఫైనల్ అయ్యారు. ఈ చిత్రాన్ని కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తుండగా అల్లూరి కృష్ణం రాజు డైరెక్ట్ చేయనున్నారు. ఈ బయోపిక్ కు ‘ఉద్యమ సింహం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను నిర్ణయించారు. ఈ సినిమా ఈరోజే అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా లాంచ్ అయింది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు