విషాదం : సీనియ‌ర్ న‌టి మృతి !

Published on Jul 26, 2021 10:33 am IST

సీనియ‌ర్ న‌టి జ‌యంతి నిన్న రాత్రి తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నేళ్లుగా జ‌యంతి అస్త‌మాతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు. ఆ సమస్యతోనే ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఇటివల బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసి చికిత్స అందించారు. అయినా జ‌యంతి ప్రాణాలను డాక్టర్స్ కాపాడలేకపోయారు.

1945 జనవరి 6న జ‌యంతి బళ్ళారిలో జన్మించారు. కన్నడ సినిమా ‘జెనుగూడు’తో తెరంగేట్రం చేసినా.. ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగు, అలాగే తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. ముఖ్యంగా ఎమోషనల్ రోల్స్ లో తనదైన ముద్ర వేశారు. ‘123తెలుగు.కామ్’ నుండి జయంతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :