సీనియర్ నటిని ఆదుకోవాలని విజ్ఞప్తి !

Published on May 17, 2021 9:30 pm IST

‘పావలా శ్యామల’ తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నటి. అయితే ఆమెకు ప్రస్తుతం తినడానికి కూడా తిండి లేక చాలా కష్టాలు పడుతుంది. ‘ఐదు రోజులు పస్తులున్నా.. ఆకలితో చనిపోతామనుకున్నా.. దయ చేసి మమ్మల్ని ఆదుకోండి’ అని ఆమె తన బాధను చెబుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నారు. పైగా అనారోగ్య పరిస్థితులతో నటనకు కూడా దూరమయ్యారు.

కాగా ప్రస్తుతం ఆమె ఎస్‌.ఆర్‌.నగర్‌ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. అద్దెను కూడా చెల్లించలేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఆమె కూతురు కూడా మంచనా పడ్డారు. ఇక శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత సమాచారం :