పోస్ట్ ప్రొడక్షన్ లో సీనియర్ కమెడియన్ సినిమా !

Published on Jun 5, 2019 4:00 am IST

సీనియర్ కమెడియన్ ఆలీ హీరోగా గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగాను, నటీనటుల పేర్లు వైవిధ్యంగాను ఉంటాయి. అలాగే సంగీత దర్శకుడు యాజమాన్య సారథ్యంలో శ్రేయగోషల్, మనీషా చక్కని పాటలు పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని జూన్ ఎండింగ్ లో రిలీజ్ చేయలనుకుంటున్నాం” అని అన్నారు.

కాగా ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. హీరోకు 40 ఇయర్స్ వచ్చే వరకు పెళ్లి కాదు. పూర్తి హాస్య భరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన ఆలీ ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనని కనబర్చాడట. ఈ సినిమాలో అలీ సరసన హీరోయిన్ గా రిషిత నటిస్తోంది. అలాగే వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More