తండ్రి పాత్రలో సీనియర్ హీరో !

Published on Mar 27, 2019 11:49 pm IST

సీనియర్ హీరో శ్రీకాంత్ ఇటీవల సోలో హీరోగా సినిమాలు తగ్గించేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. అందులో భాగంగా గోవిందుడు అందరివాడేలే , సరైనోడు లో రామ్ చరణ్ , అల్లు అర్జున్ లకు బాబాయ్ గా నటించాడు. ఇక ఇప్పుడు ఆయన తండ్రి పాత్ర లో నటించడానికి సిద్ధమయ్యారు. రాహుల్ విజయ్ హీరోగా కన్నడ లో విజయం సాధించిన ‘కాలేజీ కుమార’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేయనున్నారు.

ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ లో హీరోకి తండ్రి గా శ్రీకాంత్ నటించనుండగా తమిళ వెర్షన్ లో ప్రభు నటించనున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సంతు ఈ రీమేక్ ను తెరక్కించనున్నాడు. ఏప్రిల్ మూడవ వారంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :