‘ఎన్టీఆర్’ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ?

‘ఎన్టీఆర్’ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ?

Published on May 15, 2023 8:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ ఉందట. ఈ పాత్రలో ఓ సీనియర్ హీరోని అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ పాత్రలో ఏ సీనియర్ స్టార్ హీరోని ఒప్పిస్తారో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఐతే, ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో హీరోయిన్ అనన్య పాండే నటించే ఛాన్స్ ఉందని తాజాగా టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు