‘పొలిటికల్‌ డ్రామా’లో సీనియర్ హీరో !

Published on Mar 7, 2019 6:19 pm IST

మొత్తానికి ప్రవీణ్ సత్తారు సీనియర్ హీరో రాజశేఖర్ కి ‘పీఎస్వీ గరుడ వేగ’ రూపంలో భారీ హిట్ ఇచ్చి.. మళ్ళీ రాజశేఖర్ ను ఫామ్ లోకి తీసుకువచ్చాడు. ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్నా రాజశేఖర్.. ఈ మధ్యలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజశేఖర్ హీరోగా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదల కాకుండా ఆగిపోయిన ‘అర్జున’ అనే సినిమాను ఈనెల 15న విడుదల చేస్తున్నారు.

కాగా ఈ సినిమాకు తమిళ దర్శకుడు కణ్మణి దర్శకత్వం వహించారు. పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

సికె ఎంటర్‌టైన్‌మెంట్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక ఈ చిత్రంలో రాజశేఖర్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర ఆఫీసర్ గా అయితే, మరో పాత్ర పొలిటీషియన్ పాత్ర. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More