కథా రచయితగా మారిన ఒక్కప్పటి హీరో !

కథా రచయితగా మారిన ఒక్కప్పటి హీరో !

Published on Jun 19, 2018 10:31 PM IST

Senior Naresh

‘రంగ‌స్థ‌లం, ఛలో, ఛల్ మోహన్ రంగ, మ‌హాన‌టి, స‌మ్మోహ‌నం’ ఇలా ఈ సంవత్సరంలో ఆయనకు వ‌రుస‌గా హిట్లే, అన్ని చిత్రాల్లోనూ గుర్తుంచుకోదగిన పాత్ర‌లే. ఇది సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ నటుడు న‌రేష్‌ గారి ట్రాక్ రికార్డ్. ఒకప్పుడు కామెడీ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈయనలో ఎవరికీ తెలియని ఇంకో కోణం ఏంటంటే.. ఆయనలో ఒక రచయిత ఉన్నాడు. కథలు కూడా రాస్తుంటారు. ఇప్పుడు ఆయన రియల్ లైఫ్ లో చిత్ర క‌థ‌కుడిగా సరికొత్త పాత్ర ఎత్త‌బోతున్నారు.

రీసెంట్ గా ఆయన తను రాసిన క‌థల్లో ఒక కథ సినిమాకైతే బాగుంటుందనిపించి ఓ యువ ద‌ర్శ‌కుడికి వినిపించారు. కథ బాగా నచ్చడంతో ఆ యువ ద‌ర్శ‌కుడు న‌రేష్ గారికి కొంత మొత్తలో అడ్వాన్స్ ఇచ్చి ఆ క‌థ‌ని లాక్ చేశారని తెలుస్తోంది. అంటే నరేష్ గారిని త్వరలో సినీ కథా రచయితగా కూడా చూడొచ్చన్నమాట. ప్ర‌స్తుతం నితిన్ యొక్క ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్న ఈయన బాలకృష్ణ చేయనున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కూడా నటిస్తున్నారని సమాచారం.

తాజా వార్తలు