కోవిడ్ తో టాలీవుడ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత.!

Published on May 21, 2021 9:01 am IST

గత ఏడాది లానే ఈసారి కూడా కరోనా మూలాన ప్రపంచ వ్యాప్తంగా తీరని ప్రాణ నష్టం జరిగింది ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కరోనా మూలాన తమ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ప్రముఖ సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ జయరాం కోవిడ్ మూలాన మరణించారన్న వార్త తెలుగు ఇండస్ట్రీలో మరింత విషాదం నెలకొల్పింది.

వరంగల్ లో జన్మించిన ఆయన యుక్త వయసులోనే సినిమాల పట్ల ఆసక్తి పెరిగి ఫోటో గ్రాఫర్ గా జాయిన్ అయ్యారు అక్కడ నుంచి అప్పటి మద్రాసుకు తన 13వ ఏటనే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అక్కడ నుంచి సీనియర్ ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, చిరంజీవి ఇలా ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు తన సినిమాటోగ్రఫీ అందించారు.

వాటిలో పెళ్లి సందడి, మేజర్ చంద్రకాంత్ లాంటి భారీ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ కరోనాతో పోరులో నిన్న గురువారం రాత్రి వరకు పోరాడి తన 70వ ఏట తుది శ్వాస విడిచారు. దీనితో ఈ వార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు తమ సానుభూతిని వ్యక్త పరిచారు. ఆయన లేని లోటు టాలీవుడ్ కు తీరనిది. మరి ఆయన అకాల మరణం పట్ల మాయా 123 తెలుగు టీం కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తుంది.

సంబంధిత సమాచారం :