జూ. ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన ప్రముఖ సీనియర్ నిర్మాత !

Published on Jul 28, 2018 12:50 pm IST

గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతూ వస్తున్న డ్యాన్స్ షోగా ‘ఢీ’ నిలిచిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఇటీవలే ఈ సూపర్ హిట్ డ్యాన్స్ షో ‘ఢీ10’కి ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. దాంతో ఫైనల్ ఎపిసోడ్ కి ఎవరు ఊహించని విధంగా 13.9 TRP రేటింగ్ తో షో టాప్ లో నిలిచింది.

అయితే ఎన్టీఆర్ ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా రావడంపై మొదట అనేక రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఆయన 25లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ వాస్తవానికి తారక్ ఈ షోకు హాజరైనందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఢీ10 ఫైనల్స్ కు ఎన్టీఆర్ హాజరు కావడానికి ముఖ్య కారణం ప్రముఖ సీనియర్ నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిపై ఆయనకున్న ప్రత్యేకమైన గౌరవమే కారణం. చాలా సంవత్సరాలుగా వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతూ ఉంది.

కాగా ఓ సారి గతంలోకి వెళ్తే తారక్ మొదటి చిత్రం రామాయణం సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి గారైన ప్రముఖ సీనియర్ నిర్మాత ఎమ్.ఎస్ రెడ్డిగారు నిర్మించారు. అప్పటి నుంచి మల్లెమాల వారితో తారక్ కు మంచి అనుబంధం ఉంది. ఇక డీ10 నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘షో’కు హాజరైనందుకు యంగ్ టైగర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Disclaimer : మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మరియు 123తెలుగు.కామ్ రెండూ శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి చెందినవే.

సంబంధిత సమాచారం :