ఎన్టీఆర్ సినిమా నుండి క్రేజీ ఎనౌన్స్ మెంట్ ?

Published on Jun 14, 2021 12:01 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీ నుండి అతి త్వరలో ఓ సంచలనాత్మక అప్ డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఐతే, తాజా వార్త ఏమిటంటే కియారా అద్వానీనే హీరోయిన్ గా తీసుకున్నారని, ఆమె ఈ సినిమా కోసం సైన్ కూడా చేసిందని త్వరలోనే అధికారికంగా ప్రకటించారని తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. ఇక ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేస్తున్నాడట. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఇది ఈ సినిమాలో ఎక్కువుగా బాలీవుడ్ కాస్టింగ్ ఉంటుందట.

సంబంధిత సమాచారం :