పవన్, మహేష్ ల సినిమా అంటూ సెన్సేషనల్ బజ్..క్లారిటీ.?

Published on Aug 8, 2021 11:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కాంబినేషన్ కోసం మూవీ లవర్స్ కి ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల అభిమానులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కానీ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రైవల్ అయినా.. ఫ్రెండ్లీ బాండింగ్ అయినా కూడా వీళ్ల అభిమానులదే అని చెప్పాలి. అయితే చాలా మందికి వీరిలో తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బహుశా ఇది నెరవేరదని వారికి కూడా తెలుసు కానీ ఏమో అవుతుందేమో అన్న హోప్ లో మాత్రం ఇప్పటికీ ఉన్నారు. అయితే అది ఏ దర్శకుని చేతిలో అవుతుందో కానీ ఇప్పుడు ఒక ఊహించని సెన్సేషనల్ బజ్ బయటకి వచ్చి వైరల్ అవుతుంది.. అయితే ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారని కాకుండా ఎవరో ఒకరి ప్రొడక్షన్ హౌస్ లో ఒకరు హీరోగా నటిస్తారని బజ్ బయటకి వచ్చింది.

అసలే ఈ కాంబోపై చిన్న బజ్ వచ్చినా ఒక లెవెల్లో రచ్చ లేస్తుంది. దీనితో సడెన్ గా వచ్చిన ఈ టాక్ కూడా యిట్టె వైరల్ అయ్యింది.. కానీ దీనిపై క్లారిటీ కూడా తెలుస్తుంది. అసలు ఈ కాంబోలో సినిమా పరస్పర నిర్మాణం అనేది చర్చ లోకే రాలేదు అని తెలుస్తుంది. అదంతా జస్ట్ రూమర్ మాత్రమే అని వైరల్ అవుతున్న ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాల నుంచి సమాచారం.. సో ప్రస్తుతానికి ఈ విషయంలో ఎగ్జైట్ అవ్వాల్సిన పని లేదు అం చెప్పాలి.

సంబంధిత సమాచారం :