సెన్సేషనల్ హీరో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

Published on Mar 5, 2019 7:57 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇదిలావుంటే విజయ్ మరో కొత్త సినిమాకి ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో త్రి బాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శలకుడు. తెలుగు , తమిళ ,కన్నడ భాషల్లో ఒకే సారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటించనుందట. ఇక ఈచిత్రంలో విజయ్ బైక్ రేసర్ గా కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలను అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.

సంబంధిత సమాచారం :

More