విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్ ‘వెంకీమామ’ మొదటి షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రి లో జరుగుతుంది. తాజాగా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంలో ఆమె, వెంకీ కి జోడిగా నటిస్తుంది. ఇక ఈ మొదటి షెడ్యూల్ తుది దశకు చేరుకుంది. రెండవ షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ కానుందని సమాచారం. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతూ కి జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్ గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్ లో విడుదలకానుంది.


