సెన్సేషనల్ “కళావతి”..మరో మైల్ స్టోన్ అందుకున్న మహేష్ సాంగ్.!

Published on Mar 4, 2022 6:34 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల వేరే లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన సాలిడ్ ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

మహేష్ కెరీర్ లోనే ఏ సినిమా సాంగ్స్ కి రాని రెస్పాన్స్ సర్కారు వారి పాట “కళావతి” కి వచ్చింది. ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ ఫస్ట్ సాంగ్ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని మొదటి రోజు నుంచే అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ 60 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి మరో మైల్ స్టోన్ ని అందుకుని అదరగొట్టింది. దీనితో కళావతి సెన్సేషన్ అయితే ఇప్పుడప్పుడే ఆగేలా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :