సూర్యతో “రోలెక్స్” పై సెపరేట్ మూవీ.?

Published on Dec 13, 2022 11:00 am IST

ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ ని అమితంగా ఇంప్రెస్ చేసిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ నుంచి వచ్చి సెన్సేషనల్ హిట్స్ అయ్యిన చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో అయితే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా స్టార్ హీరో సూర్య ఓ పవర్ ఫుల్ క్యామియో “రోలెక్స్” గా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పాత్రకి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా నెక్స్ట్ అయితే ఈ క్యారెక్టర్ పై కూడా సెపరేట్ చిత్రం ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా ఆమధ్య టాక్ వచ్చింది.

మరి దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ అయితే తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆల్రెడీ విజయ్ తో సినిమా నెక్స్ట్ విక్రమ్ 2 అలాగే ఖైదీ 2 లను ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా “రోలెక్స్” సినిమాపై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని తాను రివీల్ చేసాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన యూనివర్స్ లో ఈ రెండు సినిమాలతో పాటుగా రోలెక్స్ పై కూడా సినిమా కూడా ఉంటుంది కదా అని అయితే చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో ఈ స్టేట్మెంట్ కోలీవుడ్ వర్గాల్లో మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :