ఈ థ్రిల్లింగ్ సినిమాకు సీక్వెల్ రానుందా.?

Published on Aug 7, 2020 4:48 pm IST

ఈ మధ్య కాలంలో మన తెలుగుతో పాటుగా దక్షిణాది సినీ ఇండస్ట్రీల నుంచే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. అలా ఒక భాష నుంచి మరో భాషలోకి కూడా రీమేక్ కాబడిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా కోలీవుడ్ లో తీసిన ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం మూవీ లవర్స్ ను ఒక్క సారిగా ఆకర్షించింది, అదే “రాట్ససన్”.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని మన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా “రాక్షసుడు” అనే పేరిట రమేష్ వర్మ తెరకెక్కించారు. అక్కడ ఎలాంటి విజయాన్ని ఈ చిత్రం అందుకుందో ఇక్కడ కూడా అంతే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే చాలా మంది చూడాలని కోరుకుంటున్నారు.

కానీ ఇది ఒరిజినల్ లో కాబట్టి అక్కడ ఇంకా సీక్వెల్ కు దర్శకుడు రామ్ కుమార్ ప్లాన్ చెయ్యలేదు. కానీ మన దగ్గర మాత్రం ఈ చిత్రం సీక్వెల్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే చిత్ర యూనిట్ స్టోరిను సిద్ధం చేస్తున్నారట. అలాగే మొదటి భాగంలో కనిపించిన నటులతోనే ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More