‘రోబో 2’ టెక్నికల్ టీంతో శంకర్ మీటింగ్స్

‘రోబో 2’ టెక్నికల్ టీంతో శంకర్ మీటింగ్స్

Published on Sep 20, 2015 3:04 PM IST

shankar_rajinikanth
శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘రోబో’. 2010లో విడుదలైన ఈ గ్రాఫికల్ వండర్‌కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందించే విషయమై దర్శకుడు శంకర్ కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాల్లో ఓ అద్భుతంగా ‘రోబో 2’ ఉండేలా శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి నిన్న ప్రధాన టెక్నికల్ టీమ్‌తో దర్శకుడు శంకర్ ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. టెక్నికల్ అంశాల గురించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి ఈ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న కానీ జనవరిలో కానీ ఈ సినిమా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీల్ తెచ్చేందుకు దర్శకుడు శంకర్, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు హాలీవుడ్ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్, దర్శకుడు రంజిత్‌తో కలిసి ‘కబాలి’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు