మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లలో లెజెండరీ దర్శకులు మణిరత్నం అలాగే ఆండవర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి సినిమా ఉన్నన్నినాళ్ళు నిలిచిపోయే నాయకుడు లాంటి సినిమా తర్వాత మళ్ళీ ఎన్నో ఏళ్ళకి చేస్తున్న సినిమానే “థగ్ లైఫ్”. తమిళ్ నుంచి ఒక సాలిడ్ మల్టీస్టారర్ గా కూడా వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.
ఇలా జూన్ రిలీజ్ కి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా మాత్రం ఒకింత సీరియస్ గానే ఉన్నారని చెప్పవచ్చు. ఫస్ట్ సింగిల్ లాంఛ్ కి కూడా తమిళ నాట ఒక ఈవెంట్ పెట్టి అందులోని ప్రెస్ మీట్ కూడా పెట్టి లాంచ్ చేస్తుండడం అనేది వారు ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎలాగో ఆడియో లాంచ్ కూడా ఉంది కానీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కే ఇంత హడావుడిగా ప్లాన్ చేస్తుండడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.