‘సెవెన్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందట !

Published on Jun 4, 2019 5:43 pm IST

ప్రముఖ కెమెరా మేన్ నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా మన ముందుకు వస్తున్న చిత్రం సెవెన్(7). రహ్మాన్, హవిష్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి వంటి తారాగణం నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో మ‌ల్టీప్లెక్స్‌ ల‌లో సినిమా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హవీష్, అభిషేక్ నామా, నందితా శ్వేత, త్రిధా చౌదరి, పూజితా పొన్నాడ పాల్గొన్నారు.

హవీష్ మాట్లాడుతూ “బుధవారం (ఈ నెల 5) సాయంత్రం 7.30, 9.30 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదలవుతుంది. గురువారం రెగ్యులర్ రిలీజ్. నేను ఫ‌స్ట్‌ టైమ్ క‌థ విన్న‌ప్పుడు ఎంత ఎగ్జ‌యిట్‌ అయ్యానో… ట్రైలర్ విడుదలయినప్పుడు అంతే ఎగ్జ‌యిట్‌ అయ్యాను. సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి ట్రైలరే కారణం. ట్రైలర్ చూసే అభిషేక్ నామాగారు సినిమాపై ఆసక్తి చూపించారు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అన్నారు.

అభిషేక్ నామా మాట్లాడుతూ “కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుంది. ఈ నెల 6న ప్రేక్షకులందరూ సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు. ఇక ఈ సినిమాలో ఇతర తారాగణం: పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. డైలాగ్స్: జీఆర్ మహర్షి, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ – దర్శకత్వం నిజార్ షఫీ.

సంబంధిత సమాచారం :

More