ఒకేరోజు 7 సినిమాలు విడుదలకానున్నాయి !

ఒకేరోజు 7 సినిమాలు విడుదలకానున్నాయి !

Published on Jun 19, 2018 5:14 PM IST

సాధారణంగా ప్రతి శుక్రవారం సినిమా విడుదలవడం మన తెలుగు పరిశ్రమలో ఒక సంప్రదాయం. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడ తన సినిమాలని వీలైనంత వరకు శుక్రవారం రోజునే రిలీజయ్యేలా చూసుకుంటారు. ఎందుకంటే శుక్రవారం తర్వాత వారాంతపు సెలవులు శని, ఆదివారాలు కలిసొస్తాయి కాబట్టి. దీని ప్రకారమే ఈ శుక్రవారం జూన్ 22న రెండు సినిమాలు విడుదలవుతుండగా ఆ తరవాతి శుక్రవారం అనగా జూన్ 29న ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

వాటిలో ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఒకటి కాగా హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా దర్శకుడు శ్రీధర్.ఎన్ తెరకెక్కించిన ‘శంభో శంకర’ కూడ ఉంది. వీటితో పాటే రవి వీడే డైరెక్షన్లో రూపుదిద్దుకున్న అడ్వెంచరస్ మూవీ ‘సంజీవని’, నటుడు నందు ప్రధాన పాత్రలో దర్శకుడు బిక్స్ ఏరుసాట్ల తీసిన ‘కన్నుల్లో నీ రూపమే’, మహీధర్, సోనాక్షి సింగ్ జంటగా శివ గంగాధర్ రూపొందించిన ప్రేమ కథ ‘నా లవ్ స్టోరీ’ విడుదలవుతున్నాయి.

అలాగే రవి చావాలి దర్శకత్వంలో బలరాం మక్కల నిర్మించిన థ్రిల్లర్ ‘సూపర్ స్కెచ్’ కూడ అదే రోజును విడుదల తేదీగా ఎంచుకోగా వీటిన్నిటికీ తోడు అల్లు శిరీష్, మోహన్ లాల్ నటించిన ‘1971: బియాండ్ బోర్డర్స్’ చిత్ర తెలుగు అనువాదం ‘యుద్ధ భూమి’ కూడ జూన్ 29నాడే విడుదలవుతోంది. మరి ఇన్ని సినిమాల్లో ఏయే సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించి పోటీలో నిలబడతాయో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు