సీనియర్ హీరో కామెంట్స్‌ పై తీవ్ర విమర్శలు !

సీనియర్ హీరో కామెంట్స్‌ పై తీవ్ర విమర్శలు !

Published on Nov 30, 2025 1:14 PM IST

bramandham
‘స:కుటుంబానాం’ అనే సినిమా ఈవెంట్‌ లో బ్రహ్మానందం పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అంతకు ముందు బ్రహ్మానందం మాట్లాడి.. మైక్ రాజేంద్రప్రసాద్ కి ఇచ్చారు. ఆయన మైక్ అందుకుని మాట్లాడుతూ మళ్లీ నోరు జారారు. “పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడగలం’ అంటూ ఏదో చెప్పబోతుంటే.. మధ్యలో బ్రహ్మానందం అందుకుని ‘ఎంతైనా మేం మీ శిష్యులమే కదా” అని అన్నారు.

ఆ మాటకి రాజేంద్రప్రసాద్ అకస్మాత్తుగా “నువ్వు ముసలి ము** కొడుకువి” అంటూ నోరుజారారు. వెంటనే బ్రహ్మానందం “ఎవరు?” అని అడగడం, “నేనే” అంటూ కవర్ చేసేందుకు రాజేంద్రప్రసాద్ ప్రయత్నించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో కూడా రాజేంద్రప్రసాద్ చేసిన ఇలాంటి కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోసారి ఆయన కామెంట్స్ మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు