‘ఐఎండిబి’లో టాప్ స్కోరర్ గా నిలిచిన “షాదీ ముబారక్”.!

‘ఐఎండిబి’లో టాప్ స్కోరర్ గా నిలిచిన “షాదీ ముబారక్”.!

Published on Mar 9, 2021 2:35 PM IST

గత వారమే తెలుగు ఇండస్ట్రీలో అర డజన్ కు పైగా సినిమాలు విడుదల కాబడిన సంగతి తెలిసిందే. మరి వాటిలో మంచి నడుమ వచ్చిన కొన్ని సినిమాల్లో టెలివిజన్ స్టార్ అయినటువంటి ఆర్ కె సాగర్ నాయుడు హీరోగా దృశ్య హీరోయిన్ గా పద్మశ్రీ దర్శకత్వంలో తెరకెక్కించిన “షాదీ ముబారక్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మాణం వహించారు. అయితే డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం మరో షాకింగ్ ఫీట్ ను అందుకోవడం గమనార్హం.

మంచి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) లో రీసెంట్ గా విడుదల కాబడ్డ తెలుగు సినిమాల జాబితాలో టాప్ స్కోరర్ నిలిచింది. ఏకంగా 9.1 రేటింగ్ తో ఈ సినిమా టాప్ లిస్ట్ లో నిలిచింది. దీనితో చిత్ర యూనిట్ కు ఇపుడు మళ్ళీ కొత్త ఉత్సాహం ఇచ్చినట్టు అయ్యిందని అంటున్నారు. మరి అలాగే ఆర్కే కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో వస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు