‘శాకుంతలం’ షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు

Published on Jun 14, 2021 11:44 pm IST

డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ మూవీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శాకుంతల పాత్రను స్టార్ నటి సమంత చేస్తుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. భారీ వ్యయంతో పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. చిత్రీకరణ కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడ నిలిచిపోయింది.

ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ముగియగా మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయడాని సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెల చివరి వారం నుండి చిత్రీకరణను రీస్టార్ట్ చేస్తున్నట్టు నిర్మాత నీలిమ గుణ తెలిపారు. ఇందుకోసం టీమ్ మొత్తానికి వ్యాక్సినేషన్ చేయించారు. అంతేకాదు ఈసారి తక్కువమందితోనే షూటింగ్ చేస్తామని, తరచూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ చేస్తామని అన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :