శ్రీదేవి, రోజా రమణి ల క్లబ్ లోకి అడుగు పెడుతున్న అల్లు అర్హ

Published on Jul 16, 2021 10:28 pm IST

అలనాటి అగ్ర హీరోయిన్లు తమ ప్రారంభ దశల్లో బాల నటులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ నటి, అందాల తార శ్రీదేవి బాల నటి గా యశోద కృష్ణ నటించిన సంగతి తెలిసిందే. అయితే రోజా రమణి సైతం భక్త ప్రహ్లాద గా నటించి మెప్పించారు. అయితే ఇప్పుడు ఆ క్లబ్ లోకి అల్లు అర్జున్ కుమార్తె అయిన అల్లు అర్హ చేరబోతుంది.

అయితే గుణ శేఖర్ దర్శకత్వం లో శాకుంతలం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ప్రధాన పాత్ర లో నటి సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రిన్స్ భారత పాత్ర లో అల్లు అర్హ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీదేవి మరియు రోజా రమణి ల క్లబ్ లో చేరుతున్నట్లు తెలిపింది. అయితే ఈ వార్త తో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :