‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ విడుదలకు టైం ఫిక్స్ !

Published on Mar 2, 2019 11:35 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ విడుదలకోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా రేపు ఉదయం 8:20 గంటలకు ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు.

‘రన్రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నిల్ నితిన్ ముఖేష్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. శంకర్-ఎహసాన్ -లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More