మహేష్, చరణ్ లతో షారుఖ్ మల్టీ స్టారర్!!

మహేష్, చరణ్ లతో షారుఖ్ మల్టీ స్టారర్!!

Published on Dec 7, 2015 7:00 PM IST

srk
బాలీవుడ్ బాద్షా మరియు బాలీవుడ్ కింగ్ ఖాన్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ నుంచి రానున్న సినిమా ‘దిల్వాలే’. ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. ఆ షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ మరియు రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సెట్స్ ని విజిట్ చేసి సందడి చేసారు. దిల్వాలే సినిమా డిసెంబర్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా షారుఖ్, కాజోల్ అండ్ టీం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చారు.

అక్కడ తెలుగు మీడియా వారు ఈ మధ్య మార్కెట్ పరిధులు దాటుతోంది. ఒక భాష వారు మరో భాష స్టార్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి మీరు మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ టాలీవుడ్ హీరోని సెలక్ట్ చేసుకుంటారు అని షారుఖ్ ని అడిగితే ‘మల్టీ స్టారర్ అంటే నేను మహేష్ బాబు లేదా రామ్ చరణ్ లలో ఎవరో ఒకరిని సెలక్ట్ చేసుకుంటాను. వారిద్దరితో నాకు సత్సంబందాలు ఉన్నాయి. కథ వస్తే కచ్చితంగా వారినే సెలక్ట్ చేసుకుంటానని’ షారుఖ్ తెలిపాడు. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్స్ ప్రకారం త్వరలోనే ఎవరన్నా ఈ స్టార్స్ ని కలుపుతూ ఓ మల్టీ స్టారర్ కథ రాసి ఒప్పించి సినిమా మొదలెడతారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు