తలపతి 63లో బాలీవుడ్ కింగ్ ఖాన్ ?

Published on Apr 24, 2019 9:01 am IST

ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘తలపతి 63’ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నై లో జరుగనుంది. 50 రోజుల పాటు జరుగనున్న షెడ్యూల్ కోసం ఈవీపి స్టూడియోస్ భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నారు. ఇక చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఇటీవల షారుఖ్ చెన్నై లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ను అట్లీ తో కలిసి చూశాడు ఆ తరువాత ఆయన అట్లీ ఆఫీస్ కు రావడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని టాక్ వినిపించింది. ఇక తాజాగా తలపతి 63 కోసమే అట్లీ , షారుఖ్ ను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే షారుక్ ఈసినిమా లో నటిస్తున్నాడా లేదా అని తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం ఈ దీపావళి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :