మన దగ్గర సెన్సేషనల్ హిట్ అయినటువంటి “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అంతకు మించిన భారీ విజయాన్ని అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్ సొంతం చేసుకున్నాడు. ఇక దాని తర్వాత మన తెలుగులో ఒక మరపురాని చిత్రాల జాబితాలో నిలిచిపోయే ఎమోషనల్ డ్రామా “జెర్సీ” రీమేక్ ను టేకప్ చేసాడు.
మన తెలుగులో నాచురల్ స్టార్ నానితో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో తాను హీరోగా టేకప్ చేసిన షాహిద్ ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడంపై ఒకింత ఎమోషనల్ అయ్యాడు.
ఈ విషయాన్ని తన తన మీడియాలో పంచుకున్నాడు. 47 రోజుల్లో అందులోనూ ఇలాంటి కోవిడ్ సమయంలో పూర్తి చెయ్యడం నమ్మశక్యంగా లేదని అంతే కాకుండా ఇలాంటి ఒక చిత్రంలో తాను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాని ఈ సినిమా షూట్ లో ప్రతీ రోజు రిస్క్ చేసి కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ తన ధన్యవాదాలు తెలుపుతున్నాని షాహిద్ ఎమోషనల్ అయ్యాడు.
“జెర్సీ” ఒక స్ఫూర్తిని ఇచ్చే కథ అని, అశృవుల నుంచి పైకి లేచే ఆత్మ కథ ఇది అని తన ఎమోషన్ ను పంచుకున్నాడు. అలాగే ఈ జెర్సీ ప్రయాణం కూడా తనకు ఒక మధురమైన జ్ఞ్యాపకంగా నిలుస్తుంది అని దర్శకుడు గౌతమ్ కు అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారికి ధన్య వాదాలు తెలిపాడు.
As we all fight through this pandemic. Let’s always remember. This shall pass too. Here’s to my best filmmaking experience yet. Here’s to Jersey … we shall overcome !!!! @gowtamnaidu @mrunal0801 @amanthegill #srivenkateswaracreations
— Shahid Kapoor (@shahidkapoor) December 15, 2020


