ఐకానిక్ సాంగ్ రీమేక్ లో మహేష్ హీరోయిన్

shaid kapoor kira

తెలుగులో మంచి విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం హిందీ భాషల్లోకి రీమేక్ అవుతుండగా స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభుదేవా సూపర్ డూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ చేయనున్నారు. రెండు దశాబ్దాల క్రితం కుర్రకారును ఎంతగానో అలరించిన ‘ఊర్వశి..టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి..’ పాటలో ఇప్పుడు షాహిద్‌ కపూర్‌ ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అడ్వాణీ నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

కాగా ఈ సాంగ్ ను యోయో హనీ సింగ్‌ కంపోజ్‌ చేస్తుండగా సంజయ్‌ శెట్టి కొరియోగ్రాఫర్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు.

Exit mobile version