13ఏళ్ల తరువాత బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో…!

Published on Jul 11, 2019 8:28 am IST

“కబీర్ సింగ్” చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్. ఈ మూవీ వసూళ్ల ప్రభంజనానికి ఇప్పటికే కొన్ని చిత్రాల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. 200కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం 250కోట్ల వసూళ్ల వైపుగా దూసుకుపోతుంది. “కబీర్ సింగ్” లెక్కలు చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇంతగా ప్రేక్షకులకు ఆదరణ పొందుతున్న ఈ చిత్రం విజయ రహస్యం ఏమిటని తలలుగోక్కుంటున్నారు. ఓ తెలుగు డైరెక్టర్ మూవీ ఇంతటి ప్రభంజనం సృష్టించడాన్ని జీర్ణించుకోలేకున్నారు.

ముఖ్యంగా ఈ మూవీ హీరో షాహిద్ కపూర్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డికి ఏమిచ్చినా తక్కువే, ఇక తన కెరీర్ లో ఎప్పటికీ సాధించలేననుకున్న పెద్ద బ్లాక్ బస్టర్ ని అతనికి ఇచ్చాడు. నిజానికి షాహిద్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ కాదు కదా హిట్ చిత్రాలు కూడా కేవలం ఐదు. ఆయన నటించిన పద్మావతి,ఆర్ రాజ్ కుమార్,హైదర్,కమినే,జబ్ ఉయ్ మెట్ చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.షాహిద్ హీరోగా 2006 లో విడుదలైన ‘వివాహ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ‘కబీర్ సింగ్’ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా టాప్ టెన్ గ్రాసర్స్ సాధించిన మూవీలోల లిస్ట్ లో చోటు సంపాదించాడు.

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ తో షాహిద్ రెమ్యూనరేషన్ కూడా అమాంతంగా పెరిగిపోయిందట. ఆయన ప్రస్తుతం 30కోట్లకు పైన అడుగుతున్నాడని సమాచారం. ఏదిఏమైనా తన స్టార్ డమ్ నే మార్చివేసిన డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డికి ఈ హీరో ఏమిచ్చి రుణం తీర్చుకుంటాడో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More