బాలీవుడ్ కింగ్ ఖాన్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై విజిట్ చేసాడు. అక్కడ షారుఖ ఖాన్ తన సినిమా కంటే ఎక్కువగా శంకర్ నిర్మించిన ‘ఐ’ సినిమా గురించి పొగిడేశారు.
చెన్నై రాకముందు షారుఖ్ ఐ సినిమాకి సంబందించిన కొన్ని చూసాడు. వాటిపై స్పందిస్తూ ‘ఎంతో స్టైల్ అండ్ గ్రాండ్ లెవల్లో ఐ సినిమా తీయడం అమేజింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో ఉపయోగించిన టెక్నాలజీ ఔట్ స్టాండింగ్ మరియు ఎవరూ ఊహించలేని విధంగా ఉంది. నాకు ట్రైలర్ బాగా నచ్చిందని’ అన్నాడు.
హ్యాపీ న్యూ ఇయర్ సినిమా ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా అక్టోబర్ 24న రిలీజ్ కానుంది. షారుఖ్ తో పాటు దీపిక పడుకొనే, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బోమన్ ఇరాని తదితరులు నటించారు.


