బాలీవుడ్ లో రచయిత సలీం ఖాన్ అంటే ఒకప్పుడు ఓ బ్రాండ్. ఈయనే తన సహచర రచయితతో ‘సోలో’ రాశారు. కాగా ఈయన గురించి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ తండ్రిగారు ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని షారుక్ ఖాన్ తెలిపారు. సల్మాన్ షో ‘దస్ కా దమ్’ ఫైనల్స్‌కు అతిథిగా హాజరైన షారుక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
షారుక్ మాట్లాడుతూ.. ‘ నేను ముంబయికి వచ్చిన కొత్తల్లో.. నటుడిగా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో.. నాకు సల్మాన్ ఇంట్లో వాళ్లు భోజనం పెట్టారు. ఆయన తండ్రి సలీం ఖాన్ నన్ను చాలా ప్రోత్సహించారు. కేవలం వాళ్ల వల్లే నేను ఈ రోజు షారుక్ ఖాన్ అయ్యాను’ అని ఈ స్టార్ హీరో చెప్పారు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


