ఆగస్టు నుండి క్రేజీ డైరెక్టర్ తో షారుఖ్ !

Published on Jun 2, 2021 12:11 pm IST

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా తీసిన ప్రతి సినిమాని తన డైరెక్షన్ తో సూపర్ హిట్ చేశాడు. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. పైగా అట్లీ అంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ కుర్ర డైరెక్టర్ పై ఇప్పుడు వెర్రి అభిమానం చూపిస్తున్నారు. కారణం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు అని.

నిజానికి షారుఖ్ అట్లీతో సినిమా చేస్తున్నాడు అని చాల కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ వార్త పై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ సమ్మర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలని చూశారట, కానీ కరోనా రాకతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయిందట. అయితే ఈ గ్యాప్ లో అట్లీ మాత్రం షారుఖ్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.

షారూక్ ప్రస్తుతం ‘పఠాన్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. అయితే అట్లీ – షారుఖ్ సినిమా ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :