కృష్ణాలో ‘శైలజారెడ్డి అల్లుడు’ మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి !

కృష్ణాలో ‘శైలజారెడ్డి అల్లుడు’ మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి !

Published on Sep 15, 2018 6:00 AM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నిన్న విడుదలై ఏవరేజ్ టాక్ ను తెచుకున్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతుంది. ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో ఈ చిత్రం మొదటి రోజు రూ.39,53,342 లక్షల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం అటు ఓవర్శిస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రంలో చైతుకి జోడిగా అనూ ఇమాన్యుల్ నటించగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో కనిపించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యూటర్న్’ కూడా నిన్న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది . మొదటి రోజు ఈ చిత్రంలో కృష్ణా జిల్లాలో రూ.13,18,198 లక్షల షేర్ ను రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక చావ్లా ,ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు