‘శైలజారెడ్డి అల్లుడు’ నైజాంలో బాగానే రాబడుతున్నాడు !

Published on Sep 17, 2018 12:17 pm IST


మారుతి దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం మొన్న విడుదలై ఏవరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా చైతు కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించే దిశగా వెళ్తుంది. కాగా నైజాంలో ఈ చిత్రం నాలుగవ రోజు ముగిసేసరికి రూ 71 లక్షల షేర్ కలెక్ట్ చేసింది, ఇప్పటివరకు టోటల్ గా మొత్తం రూ. 3.57 కోట్లు వసూలు చేసింది.

ఈ చిత్రం నైజాం పంపిణీదారునికి ఆరు కోట్ల రూపాయలకు విక్రయించబడింది. అయితే కీలకమైన వారాంతపు రోజుల్లో ఈ చిత్రం ఇలాగే కలెక్షన్స్ రాబట్టగలిగితే.. ఆ ఆరు కోట్లు రావడం పెద్ద కష్టమైన పని కాదు. మొత్తం మీద ‘ఇగో’ అనే చిన్న పాయింట్ తో మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రత్యేకించి ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో నటించడం విశేషం.

సంబంధిత సమాచారం :