శైలజారెడ్డి అల్లుడు 4రోజుల కలక్షన్స్ !

శైలజారెడ్డి అల్లుడు 4రోజుల కలక్షన్స్ !

Published on Sep 17, 2018 6:58 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇక నాలుగు రోజులకుగాను ఈచిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.13.42కోట్ల షేర్ రాబట్టి నాగ చైతన్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇంతకుమందు చైతు నటించిన ‘ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలు ఆయన కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించగా తాజాగా ఈ ‘శైలజారెడ్డి అల్లుడు’ కేవలం నాలుగు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఇక ఇప్పటివరకు ఈచిత్రం 73శాతం పెట్టిన పెట్టుబడిని వెన్నక్కి తీసుకొచ్చింది. ఫుల్ రన్లో ఈచిత్రం మంచి లాభాలను తీసుకరానుంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు