‘శైలజారెడ్డి అల్లుడు’ ఆడియో వేడుక లేనట్లే ?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను ఈ ఆదివారం ప్లాన్ చేశారు కానీ అనివార్య కారణాలవల్ల ఈవేడుకును వాయిదా వేశారని సమాచారం. ఇక ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ను డైరెక్ట్ గా నెట్ లో విడుదల చేసి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపనున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతు కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ శైలజా రెడ్డి పాత్రలో నటించిన ఈచిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version