మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. నిన్న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈసినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకున్న బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 12కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి చైతు కెరీర్లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటిరోజు 6.93కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక దాదాపు సంవత్సరం గ్యాప్ తరువాత ఈచిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన చైతన్య కు ఈ ఓపెనింగ్స్ అన్ని రకాలుగా సంతృప్తినిచ్చాయి. ఈమూడు రోజులు చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఎలాంటి డోకా లేకున్నా వచ్చే సోమవారం నుండి ఎలాంటి రన్ ను కనబరుస్తుందో చూడాలి. కాకపోతే మరో రెండు వారాల వరకు పెద్ద చిత్రాల విడుదల లేకపోవడం ఈచిత్రానికి కలిసిరానుంది.


