‘మెగాస్టార్ సినిమా’ టైటిల్ తో వస్తోన్న కమెడియన్ సినిమా !

‘మెగాస్టార్ సినిమా’ టైటిల్ తో వస్తోన్న కమెడియన్ సినిమా !

Published on Sep 28, 2018 6:00 PM IST

shakalaka shnakar

హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఖైదీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్య క్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం విజయదశమి సందర్భంగా షూటింగ్‌ ప్రారంభించనుంది. అయితే పూర్తీ హాస్యభరితంగానే కాకుండా అటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా కూడా రూపొందుతున్న ఈ చిత్రానికి మెగాస్టార్ సినిమా టైటిల్ పెట్టనున్నారట.

తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ…‘చిరంజీవి గారి కెరీర్‌ ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’. అలాంటి సక్సెస్ ఫుల్ సినిమా టైటిల్‌ తో షకలక శంకర్‌ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాగా ఖైదీ సినిమాకు ఏ మాత్రం చెడ్డ పేరు రానివ్వము అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ దసరా సందర్భంగా మా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌ గా ప్రారంభించనున్నాం అని, మా దర్శకుడు మంచి స్క్రిప్ట్ ని తయారు చేశారని ఆయన తెలిపారు.

తాజా వార్తలు