‘అర్జున్ రెడ్డి’ భామ అధ్యాయం టాలీవుడ్ లో ముగిసినట్టేనా?

Published on Jul 12, 2019 7:25 am IST

హీరోయిన్ షాలిని పాండే ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో సినీ అరంగేట్రం చేసింది. అంత పెద్ద విజయాన్ని ఆరంభం లోనే అందుకున్న షాలినికి ఆతరువాత టాలీవుడ్ లో పెద్ద అవకాశాలేమి రాలేదు. ఈ మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘118’ మూవీ కూడా ఆశించిన విజయం సాధించక పోవడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం షాలిని మూడు తమిళ సినిమాలలో నటిస్తుండగా, వాటిలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ‘సైలెన్స్’ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. ఈ మధ్య ఓ యంగ్ హీరో సినిమాలో షాలిని అవకాశం దక్కించుకుంది అని వార్తలు వచ్చినా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. దీనితో తెలుగులో ఈ భామ అధ్యాయం ముగిసినట్టే అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More